– ఏప్రిల్ నుంచి అమల్లోకి
– ఐటి శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే మార్చి 31లోపు ఆధార్ కార్డుతో తప్పనిసరిగా పాన్ కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటి) తెలిపింది. అనుసంధానం చేసుకోని పాన్ కార్డులు చెల్లుబాటు కావని, నిరుపయోగంగా మారుతాయని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. మినహా యింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు వినియోగదారులు వారి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఐటి శాఖ శనివారం ట్వీట్ చేసింది. దీనికి 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. గడువు తేది దగ్గరపడుతోన్న నేపథ్యంలో తక్షణమే అను సంధానం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం పాన్‌తో ఆధార్ లింక్‌కు రూ.1000 వసూలు చేస్తోంది. ఇంత మొత్తం చెల్లించడం చాలా భార మని లక్షలాది మంది ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఎన్ఎస్డిఎల్ సైట్లో పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి వీలుంది.