– గత మూడేండ్ల లెక్కల సారాంశమిదే
– ఆర్థిక మందగమనం వల్ల ఎగుమతులపై ప్రభావం..
– కరంట్ అకౌంట్ లోటుతో రూపాయికి ఒత్తిడి
– ‘కరోనా’ను ఎదుర్కోవటంలో స్వయం సహాయక బృందాలది కీలక పాత్ర
– కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి
ఆత్మ నిర్భర్ భారత్ అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పిన మాటలన్నీ ‘కేవలంమాటలేనని’ తేలిపోయింది. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ ప్రధాని మోడీ పదే పదే చేసిన ప్రకటనలన్నీ కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊదరగొట్టుడేనని స్పష్టమైంది. గత మూడేండ్ల లెక్కలు, గణాంకాలప్రకారం… దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కాదు.. తిరోగమనంలో కొనసాగుతోందని స్పష్టమైంది. ఇది ప్రతిపక్షాలో, ఆర్థిక నిపుణులో చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక సర్వే (2022-23) నిగ్గు తేల్చిన నిజాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని ఆ సర్వే వెల్లడించింది. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందంటూ ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంటే వచ్చే ఏడాది ప్రస్తుత సంవత్సరం కన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందనే విషయం విదితమవుతున్నది. 2022-23 ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదికలో దేశ జీడీపీ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి, కరంట్ అకౌంట్ లోటు, కొనుగోలు శక్తి, కోవిడ్ అనంతర ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం, వినియోగదారుల ధరల సూచీ, ద్రవోల్బణం తదితరాంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎనిమిదిన్నరేండ్ల కాలంలో అనుసరించిన విధానాల వల్ల ఆర్థిక వృద్ధి మెరుగుపడకపోగా… మరింత దిగజారిందనే విషయాన్ని నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు దారుణంగా దెబ్బతింటూ వస్తున్నాయి. దేశంలో ఒక్క పూట కూడా తిండి తినలేని వారి సంఖ్య 23 కోట్లుగా ఉందంటే…పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు గతంలో 20 శాతంగా ఉంటే… ఇప్పుడు ఆ శాతం ఏడుకు పడిపోయింది. ఈ పరిణామాలన్నిటి రీత్యా… మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు.. ప్రజల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం కాకుండా కొంత మంది వ్యక్తులు, కార్పొరేట్ శక్తులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయనే విషయం సుస్పష్టమవుతున్నది.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు…
-భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.8 శాతంతో వృద్ధి చెందుతున్నది. దీన్నిబట్టి ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన దేశం స్థానం కొనసాగుతోందని చెప్పొచ్చు.
– రాబోయే ఆర్థిక సంవత్సరం(2023-24)లో మన దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నామినల్ టర్మ్స్‌లో 11 శాతంగా ఉంటుందని అంచనా. మౌలికాంశాలు బలంగా ఉండటం వల్ల దేశ వృద్ధి నిలకడగా కొనసాగుతుంది. అత్యధిక మూలధన వ్యయం, ప్రయివేటు వినియోగం, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలు పెరగడం, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండటం, వలస కార్మికులు తిరిగి నగరాలకు చేరుకుంటుండటం తదితర పరిణామాల వల్ల జీడీపీ వృద్ధి నిలకడగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒడుదొడుకుల నడుమ ఈ అంచనాలు గట్టి భరోసాను ఇస్తున్నాయి. అయితే కరంట్ అకౌంట్ లోటు మరింతగా విస్తరిస్తే, భారతదేశ కరెన్సీ అయిన రూపాయి ఒత్తిళ్లకు గురవుతుంది.
-కొనుగోలు శక్తినిబట్టి చూసినపుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలోనూ, ఎక్సేంజ్ రేట్‌నుబట్టి చూసినప్పుడు ఐదో స్థానంలోనూ ఉంటుంది.
-భారతదేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు కోలుకుందని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో మందగమనం నుంచి ఆ వ్యవస్థ తేరుకున్నట్టు… మళ్లీ పుంజుకున్నట్టు తెలిపింది.
-కరంట్ అకౌంట్ డెఫిసిట్‌కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్టు ధీమా వ్యక్తం చేసింది. రూపాయి విలువలో చంచలత్వాన్ని సర్దుబాటు చేయగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు సీపీఐ (వినియోగ దారుల ధరల సూచీ) ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశిత పరిమితి కన్నా మించిపోలేదని పేర్కొంది.
-కోవిడ్ మహమ్మారి సమయంలో ఏర్పడిన సంక్షో భాన్ని ఎదుర్కోవటంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కీలక పాత్ర పోషించారు. మాస్క్‌లను తయారు చేయడంతోపాటు వాటిని గ్రామీణ, మారుమూల ప్రాంతా ల్లోని ప్రజలు వాడేలా వారికి అవగాహన కల్పించటంలో ఈ మహిళల పాత్ర గొప్పగా ఉందంటూ ప్రశంసించింది. నిల కడగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఎదురవు తున్న ఒడుదొడుకుల నడుమ ఈ అంచనాలు గట్టి భరోసాను ఇస్తున్నాయి. అయితే కరంట్ అకౌంట్ లోటు మరింతగా విస్తరిస్తే, భారతదేశ కరెన్సీ అయిన రూపాయి ఒత్తిళ్లకు గురవుతుంది.
-కొనుగోలు శక్తినిబట్టి చూసినపుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలోనూ, ఎక్సేంజ్ రేట్‌నుబట్టి చూసినప్పుడు ఐదో స్థానంలోనూ ఉంటుంది.
-భారతదేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు కోలుకుందని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో మందగమనం నుంచి ఆ వ్యవస్థ తేరుకున్నట్టు… మళ్లీ పుంజుకున్నట్టు తెలిపింది.
-కరంట్ అకౌంట్ డెఫిసిట్‌కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్టు ధీమా వ్యక్తం చేసింది. రూపాయి విలువలో చంచలత్వాన్ని సర్దుబాటు చేయగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు సీపీఐ (వినియోగ దారుల ధరల సూచీ) ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశిత పరిమితి కన్నా మించిపోలేదని పేర్కొంది.
-కోవిడ్ మహమ్మారి సమయంలో ఏర్పడిన సంక్షో భాన్ని ఎదుర్కోవటంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కీలక పాత్ర పోషించారు. మాస్క్‌లను తయారు చేయడంతో పాటు వాటిని గ్రామీణ, మారుమూల ప్రాంతా ల్లోని ప్రజలు వాడేలా వారికి అవగాహన కల్పించటంలో ఈ మహిళల పాత్ర గొప్పగా ఉందంటూ ప్రశంసించింది.