ఆశా లో కు నిర్ధారిత వేతనం అమలు చేయాలి

– సిఐటియు నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్లు తాము పనిచేసే గ్రామాల్లో ప్రజలకు రేయింబవళ్లు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ నిర్ధారిత వేతనం, శాఖాపరమైన సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించక పోవడం అన్యాయమని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వినాయకపురం, గుమ్మడివల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముందు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒక్క రోజు దీక్ష చేపట్టారు.
అనంతరం సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని ఆయా వైద్యాధికారులు రాందాస్,మధుళిక లకు అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతి, సమత, నాగమణి, విష్ణు కుమారి విజయలక్ష్మి, భూదేవమ్మ, లక్ష్మి, రమణ, వెంకాయమ్మ, చిలకమ్మ రాధ తదితరులు పాల్గొన్నారు.

Spread the love