– పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు, టైర్ల ధరలు
– కేంద్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకం, సంపన్నులకు అనుకూలం : సీపీఐ(ఎం) నగర కార్యదర్శి
ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ బుధవా రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సామాన్యులకు నిరాశే కల్గించింది. సంపన్నులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సామాన్యులకు సంబంధించిన ఉపాధి హామీ పథకానికి నామమాత్రంగానే నిధులు కేటాయించారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం ఊసేలేదు. దీంతోపాటు నగరంలో ఉండే మధ్యతరగతి ఎక్కువగా ఉపయో గించే బ్రాండెడ్ దుస్తువుల ధరలు పెరగనున్నాయి. మోటారు వాహనాలకు సంబంధించిన టైర్ల ధరలు సైతం పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బాండెడ్ దుస్తువుల బడ్జెట్ పెరగనుంది. ఇదిలా ఉండగా బంగారం, వెండి ధరలు ఆకాశానం టనున్నాయి. వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 – రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధా నాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎం దులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకో వచ్చు. కాని ఉద్యోగులు మాత్రం కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరుస్తు న్నారు. దీంతోపాటు నగరంలో అత్యధికంగా ఉండే ప్రయి వేటు ఉద్యోగులకు కేంద్ర బడ్జెట్‌తో ఒరిగిందేమిలేదని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాధారణ ప్రజలకు మాత్రం 0 నుంచి రూ. 3 లక్షలకు ఎలాంటి పన్నులు చెల్లింపులేదు. దీంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడ తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకం, సంపన్నులకు అనుకూలం సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 పేదలకు వ్యతిరేకం, సంప న్నులకు అనుకూలంగా ఉంది. కరోనాకు ముందు రెండేండ్లుగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా ముం చుకొస్తున్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితిలో ప్రజల కొనుగోలు శక్తి పెంచి, దేశీయ మార్కెట్‌ను విస్తరించుకోవాల్సి ఉంది. కాని దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులను తగ్గించుకుంటూ సంపన్నులకు మరింతగా పన్ను రాయితీలు ఇస్తున్నది. ఒక పక్క దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంటే కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధి కల్పనకిచ్చే నిధుల్లో 33శాతం తగ్గించడం, ఆహార సబ్సిడీల్లో రూ.9000 కోట్లు, ఎరువుల సబ్సిడీల్లో 50వేల కోట్లు, పెట్రోలియం సబ్సిడీల్లో 6900కోట్లు కోతలు పెట్టడం రాబోయే రోజుల్లో నిత్యా వసర సరుకులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి ప్రజలపై మరింత భారంగా మారబోతున్నది ఆహార సబ్సిడీలు, పెట్రోలు, డీజిల్ సబ్సిడీలు గతంలో కంటే పెంచాలి. నిరుద్యోగాన్ని రూపుమాపి, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. జాతీయ గ్రామీణ ఉపాధికి కేటాయింపులు పెంచాలి. నగరాల్లో కూడ ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. ఆహార పదార్థాలపై జీఎస్‌టీ, రద్దు చేయాలి. వీటన్నింటినికి తగిన విధంగా బడ్జెట్‌లో మార్పులు చేయాలి.