ఆ ‘ప్రేమదేశం’ స్థాయిలో

1996లో విడుదలై పెద్ద సూపర్‌ హిట్‌ సాధించిన ‘ప్రేమ దేశం’ సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూత లూగించింది. చాలా కాలం తర్వాత అదే టైటిల్‌తో వస్తున్న సినిమా ‘ప్రేమదేశం’. సిరి క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై త్రిగున్‌, మేఘా ఆకాష్‌ హీరోహీరోయిన్లుగా, శ్రీకాంత్‌ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా రిలీజ్‌ కానునుంది.
ఈ నేపథ్యంలో దర్శక,నిర్మాత శ్రీకాంత్‌ సిద్ధం మీడియాతో సంభాషించారు.
‘ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేసిన తర్వాత ఈ సినిమాని స్టార్ట్‌ చేశాను. రెండు విభిన్నమైన ప్రేమకథలతో చేసిన సినిమా. మోడరన్‌ గెటప్‌ ఉన్న తల్లి పాత్రకు మధుబాలని ఎంపిక చేసుకున్నాం. తనికెళ్ల భరణి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తల్లీకొడుకుల రిలేషన్‌ను చాలా చక్కగా చూపించాం. త్రిగున్‌, మేఘా ఆకాష్‌ పెయిర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ‘ప్రేమదేశం’ అంటే ఎక్కువగా కనెక్ట్‌ అయ్యేది యూత్‌. యూత్‌ బేస్డ్‌గా చూస్తే సాంగ్స్‌, సీన్స్‌, కాలేజీ బ్యాక్‌ డ్రాప్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నాం. నాటి ‘ప్రేమదేశం’ సినిమాకు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రాణం పోస్తే, నేటి ఈ సినిమాకి మణిశర్మ తన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, సంగీతంతో అంతే ప్రాణం పోశారు. ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ‘పదములే లేవు పిల్ల’ పాట, ‘తెలవారెనే స్వామి..’ ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలూ అన్ని మాధ్యమాలలో టాప్‌ చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. అవుట్‌ అండ్‌ అవుట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’ అని చెప్పారు.

Spread the love