ఆ మూడింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండి

-సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంట రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పంట రుణాల కోసం రు. 20వేల కోట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. నాలుగువేల కోట్లు, విద్యార్థులకు రూ. మూడువేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love