ఆ విద్యార్థినీలను హాస్టల్‌లో కొనసాగనివ్వాలి

– ఆల్‌ ఇండియా డెంటల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
త్వరలో ఇంటర్న్‌షిప్‌ కోసం ఎదురు చూస్తున్న 2018 బ్యాచ్‌ ప్రభుత్వ దంత విద్యార్థినీలను హాస్టల్‌ లోనే కొనసాగనివ్వాలని ఆల్‌ ఇండియా డెంటల్‌ స్టూడెంట్స్‌ అసోసి యేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మహమ్మద్‌ మంజూర్‌ బుధ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. హాస్టల్‌ ఖాళీ చేసి వెళ్లాల్సిందే అంటూ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆదేశిస్తుం డటంతో విద్యార్థినీలు మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. తాజాగా విద్యార్థులకు చెందిన 12 రూముల తాళాలను వారు లేని సమయంలో పగులగొట్టి సామాన్లు బయటపడేశారని తెలిపారు. ఇలాంటి చర్యలు సరి కావని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వారి పట్ల మాన వీయంగా వ్యవ హరించాలని కోరా రు. దంత విద్య ను అభ్యసి స్తున్న విద్యార్థి నీలకు బయటి హాస్ట ళ్లలో ఉండ టం సాధ్యప డదని స్పష్టం చేశారు.

Spread the love