ఇంగ్లాండ్‌ గెలుపు

మౌంట్‌ మౌంగానురు : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు (డేనైట్‌)లో ఇంగ్లాండ్‌ 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 394 పరుగుల రికార్డు ఛేదనలో కివీస్‌ 126 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్‌ అండర్సన్‌ (4/18), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/49) నిప్పులు చెరగటంతో కివీస్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ వరుసగా 325/9, 374 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలు బాదిన ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. రెండు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

Spread the love