ఇంటి పన్నులు తగ్గించకపోతే మున్సిపల్‌ ఆఫీసును ముట్టడిస్తాం

– రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు
– చల్లా నర్సింహారెడ్డి
– నవతెలంగాణ-మీర్‌ పేట్‌
పెంచిన ఇంటి పన్నులను తగ్గించకపోతే మున్సిపల్‌ ఆఫీస్‌ ముట్టడిస్తామని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. బుధవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఇంటి పన్నులు 200 శాతం, నల్లా బిల్లు పెంచారన్నారు. రాష్ట్రంలో ఎక్క డా లేని విధంగా మీర్‌ పేట్‌ కార్పొరేషన్‌లో ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. పక్కన ఉన్న జీఎచ్‌ఎంసీలో సై తం ఇంతగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు లేవన్నారు. అధిక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికమంత్రి అధికారంలోకి వచ్చే ముందు అధికంగా ఉ న్న ఇంటి పన్నులను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వ చ్చాక ఆ విషయం మర్చిపోయారని విమర్శించారు. పన్ను లు తగ్గించాలని ప్రజల నుండి తిరుగుబాటుకు పన్నులు తగ్గించకుండా మంత్రి వ్యవరిస్తున్నదంటూ ఆరోపించారు. ప్రజల సమస్యలను చర్చించే కౌన్సిల్‌ సమావేశం సైతం 5 నెలల అవుతున్న సమావేశ పర్చకపోవడం చూస్తే ఎంత అభివృద్ధి చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ప్రజల సమస్యల ను పక్కన పెట్టి అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీ లు కుమ్మక్కై పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికం గా ఉన్న ఇంటి పన్నులను నెల రోజుల్లో తగ్గించకపోతే ప్రజ లను సమీకరించి మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తా మని హెచ్చరించారు. మీర్‌పేట్‌ కాంగ్రెస్‌ నాయకులు చల్లా బాల్‌రెడ్డి, వెంకటేష్‌ గౌడ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Spread the love