ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌ సమస్యలను పరిష్కరించండి

–  కేటీఆర్‌కు మంత్రి తలసాని వినతి
నవతెలంగాణ-బేగంపేట్‌
సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఎంతోకాలంగా అపరిష్కతంగా ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌ సమస్య లను పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం ఇండ్ల స్థలాల సమస్యలపై మంత్రి కేటీఆర్‌ అద్యక్షతన ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీలో సభ్యులైన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడు తూ సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏండ్ల నుంచి ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకుని అనేకమం ది పేదలు నివసిస్తున్నారనీ, వారికి యాజమాన్యపు హక్కు లు కల్పించాలని కోరుతూ వస్తున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్లలో ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజల ఇండ్ల సమస్య పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదనీ, సీఎం కేసీఆర్‌ పేద ప్రజల అవస్థలు తెలిసిన వ్యక్తిగా అపరిష్కతంగా ఉన్న సమస్య పరిష్కారానికి కృషిి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇందుకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని జీరా కాంపౌండ్‌ లోని నర్సింహ స్వామి, బాలాజీ ఆలయాల పరిధిలో 70 కుటుంబాలు ఇండ్లను నిర్మించుకుని జీవనం కొనసాగిస్తు న్నారని తెలిపారు. వీరికి ప్రభుత్వం రోడ్లు, విద్యుత్‌, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా కల్పించిందని పేర్కొ న్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించాలని ప్రతిపాదనలను పంపించామనీ, స్థల బదలాయింపునకు కోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నా యని చెప్పారు. ఈ స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి కొను గోలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సుముఖంగా ఉందనీ, కలెక్టర్‌కు కూడా లేఖ పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కవాడి గూడలో గల సోమప్ప మఠం స్థలంలో సుమారు 100 నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయనీ, 1996లో 56 కుటుంబాలకు దృవీకరణ పత్రాలను ఇచ్చినట్టు తెలిపారు. ఈ స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి బదలాయింపు చేసి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతంలోని పేదల ప్రజలు ఎంతో కాలం నుంచి కోరుతూ వస్తున్నారని పేర్కొన్నారు. జీరా కాంపౌండ్‌ కాలనీలో 134 గృహాలు ఉన్నాయనీ, 1994లో జీఓ 816 ప్రకారం రెగ్యులరైజ్‌ కోసం దరఖాస్తు చేసుకోన్నప్పటికీ, ఆ సమయంలో సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వం దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిందన్నా రు. 2002లో లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జీఓ 816 గడువు ముగియడంతో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 1938లో ఆదయ్య నగర్‌లో 380, రాంగోపాపేటలో 691, న్యూ బోయగూడలో 66 మొత్తం 1047 ఇండ్లను అప్పటి మున్సిపల్‌ అధికారులు నిర్మించి రూ.2 అద్దెకు ఇవ్వగా, 1984లో 1961లో మార్కెట్‌ ధరల ప్రకారం లబ్దిదారుల కు రూ.1489 విక్రయించాలని నిర్ణయించి ఆదయ్యనగర్‌ లో 143, రాంగోపాల్‌పేట లో 267 ఇండ్లను లబ్దిదా రులకు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు తెలిపారు. 2000లో అప్పటి అధికారి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే యాజమాన్యపు హక్కులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. సనత్‌ నగర్‌ లోని శ్యామలకుంట, రాంగోపాల్‌ పేట లోని వెంగళ్‌ రావు నగర్‌ లలో అనేక మంది పేదలు ఇండ్లను నిర్మించుకుని ఏండ్లుగా నివసిస్తు న్నారని తెలిపారు. రికార్డులలో ఎఫ్‌టీఎల్‌ కింద నమోదు చేయబడిందనీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌ లో చేసిన విధంగా ఆయన్‌ కింద మార్పిడి చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇవ్వడం ద్వారా వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతామని చెప్పారు. నియోజకవర్గ్గం పరిధిలోని ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులను తెలియజేసేందుకు ఈ నెల 15వ తేదీన రెవెన్యు, దేవాదాయ, ఇరిగేషన్‌ తదితర శాఖలకు చెందిన ఉన్నత అధికారులతో కలిసి పర్యటించ నున్నట్టు మంత్రి తెలిపారు. వచ్చే సోమవారం జరిగే క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం ముందు ఈ వివరాలను సమర్పించనున్నట్టు తెలిపారు.

Spread the love