గుప్పెడు కరివేపాకుల్ని కడిగి నీళ్లలో వేసి మరిగించండి. ఆపై వడకట్టి కాస్త పటిక బెల్లం వేసుకుని తాగి చూడండి. ఆ ఆకుల సువాసన నరాలను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, కరివేపాకులో ఫినోలిక్స్ అనే యాంటీ ఆసిడ్ చర్మ వ్యాధులను నయం చేస్తుంది. కరివేపాకు చారు రోజూ తాగితే ఇందులోని విటమిన్లూ, ఖనిజాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని మెరిపిస్తాయి.