నవతెలంగాణ-నాచారం
నాచారం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన కిరణ్ కుమార్ బదిలీపై సైబర్ క్రైమ్‌కు వెళ్తున్న సందర్భంగా నాచారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే ప్రజలకు మరింతగా చేరువవుతారని నిరూపించారు కిరణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కొనసాగించాలని ఆదేశించిన తదుపరి స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ వారికి ఆప్తుడుగా నిలిచారని కొనియాడారు. శాంతి భద్రతల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాలతో స్నేహపూర్వకంగా మెదులుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆత్మబంధువుగా, ఆజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు. సేవా భావం కలిగిన అధికారి ఎక్కడ పని చేసినా ప్రజలకు దగ్గర అవుతారనీ, పోలీస్ సిబ్బంది, ఎస్సైలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగరాజు, కుమారస్వామి, కానిస్టేబుళ్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.