ఈనెల 18న రిలీజ్‌

అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. ‘భలే భలే మగాడివోరు, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, 18 పేజెస్‌’ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్లో వస్తున్న సినిమా కావడంతోపాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌, టీజర్‌తోపాటు లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత హైప్‌కి తీసుకెళ్ళాయి. నెంబర్‌ నైబరింగ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మహాశివరాత్రి కానుకగా ఈనెల 18న ఈ సినిమా థియేటర్స్‌లో భారీగా విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్‌ సభ్యుల మన్ననలు పొంది యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా జంటగా నటించారు.

Spread the love