– బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి
నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాలైన వివిధ గ్రామ దేవతల జాతర ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని, ప్రభుత్వ విప్ తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి గంప శశాంక్ సూచించారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో మంగళవారం ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం డిసిసిబి డైరెక్టర్బీ లింగాల కిష్ట గౌడ్ గంప శశాంక్ ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, సర్పంచ్ బైండ్ల సులోచన సుదర్శన్, ఉప సర్పంచ్ సాయబుగారి సిద్ధ గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ ఎస్కే సుల్తానా,బిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్రి రంజిత్ వర్మ,ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.