ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

– హుస్నాబాద్‌ ఏపీఓ పద్మ
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
ఉపాధి హామీ పనులను గ్రామస్తులు సద్వి నియోగం చేసుకోవాలని హుస్నాబాద్‌ ఏపీవో పద్మ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలో సర్పంచ్‌ మంగ విజయలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కావాల్సిన పనులను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ పనులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వంగ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love