– పాపన్నగారి మాణిక్ రెడ్డి
– టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ
– ఎమ్మెల్సీ అభ్యర్థి
– శంషాబాద్‌లో విస్తృత ప్రచారం
నవతెలంగాణ-శంషాబాద్
విద్యారంగంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరి ష్కారం కోసం మార్చిలో జరగబోతున్న హైదరాబాద్ మహ బూబ్‌నగర్, రంగారెడ్డి నియోజకవర్గం నుండి ఉపాధ్యా య ఎమ్మెల్సీగా తనని గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డి అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆయన బుధవారం శంషాబాద్ మండ లంలోని వివిధ ప్రభుత్వ విద్యాసంస్థలలో ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను, విద్యారం గంలో పేరుకుపోతున్న సమస్యలను గురించి స్థానిక ఉపా ధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశా రు. పేద బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అం దించాలంటే నిజాయితీపరులైన, సమర్థులైన వ్యక్తులను మండలికి పంపించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఆదినుంచి యూటీఎఫ్ నికరమైన రాజీలేని పోరాటాలతో అనేక సమస్యలను పరిష్కరించిన చరిత్రుందన్నారు. ప్రజా విద్యా బలపడాలన్న లక్ష్యంతో తా ను బరిలో దిగుతున్నానని ఉపాధ్యాయులందరూ తనకు సంపూర్ణ మద్దతు తెలిపి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలపడా లంటే నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి విద్యారంగా సమస్యల పరిష్కారానికి కృషి జరగాలంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాణిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ప్రచారంలో సీనియర్ నాయకులు టేలి శ్వరయ్య జిల్లా కార్యదర్శి భువనేశ్వరి, శంషాబాద్ మండల అధ్యక్షులు ఇమాన్యుల్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీశైలం, కార్యదర్శి శ్రీనివాస్, నాన్ను, సదానం దం తదితరులు పాల్గొన్నారు.