ఎన్‌డీసీఏ జాతీయ అవార్డులు అందుకున్న శ్రీచైతన్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతిష్టాత్మకమైన నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమి (ఎన్‌డీసీఏ) జాతీయ అవార్డులను శ్రీచైతన్య స్కూల్‌ అందుకుంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌ సముద్రాల వేణుగోపాలాచారి, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మెన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమి ప్రతినిధులు బింగి నరేంద్రగౌడ్‌, విజరుకుమార్‌ చేతుల మీదుగా శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య స్కూల్‌ చైర్మెన్‌ బిఎస్‌ రావు, చైర్‌పర్సన్‌ ఝాన్సీ లక్ష్మిబాయి, డైరెక్టర్లు నాగేంద్ర, సుష్మ, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love