ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘనంగా సన్మానాలు..

నవతెలంగాణ-డిచ్ పల్లి
బీజెపి నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం ఆర్మూర్ లోని మామిడి పల్లి విజయలక్ష్మి గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాక ను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ఇంచార్జీ కులచారి దినేష్ కుమార్ అధ్వర్యంలో పలు మండలాలకు చెందిన బీజెపి నాయకులు భరి ఎత్తున ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామ సమీపంలోని పేద్దమ్మ ఆలయం వద్దకు చేరుకుని పుల బోకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఇంచార్జీ దన్ పాల్ సూర్యనారాయణ గూప్త, డిచ్ పల్లి ఎంపిపి గద్దె భూమన్న, గన్నరం సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి, సినియర్ నాయకులు కెపి రెడ్డి యాదవ్, మేండే అశోక్, సఖి లక్ష్మీనారాయణ ఉంగరాల శ్రీనివాస్ సంఖ్య శ్రీనివాస్ ప్రదీప్ రెడ్డి నియోజకవర్గ నాయకులు, జిల్లా మోర్చ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండల ఇంచార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, మోర్చ రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర & జిల్లా సెల్స్ కన్వీనర్లు, బీజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,తో పాటు భారీ సంఖ్యలోని మండలాలకు చెందిన పూర ప్రముఖులు నాయకులు తదితరులు తరలివచ్చారు అనంతరం గన్నారం నుండి ఆర్మూర్ వరకు కారు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Spread the love