ఎయిర్‌ ఏసియాకు రూ.20లక్షల జరిమానా

ముంబయి: ఎయిర్‌ ఏసియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) భారీ జరమానా విధించింది. పైలెట్ల శిక్షణలో వైఫల్యం చెందినందుకు రూ. 20 లక్షల జరిమానా వేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన రెగ్యూ లేటరీ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చిమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించ డంలో ఆ సంస్థ వైఫల్యం చెందిందని డిజిసిఎ పేర్కొంది. డిజిసిఎ నిబంధన ల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్‌ శిక్షణ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగిస్తూ చర్యలు తీసు కుంది. ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు రూ.3 లక్షల చొప్పున జరిమానా వేసింది. ఈ అంశంలో ఏయిర్‌ ఆసియాకు నోటీసులు జారీ చేసింది.

Spread the love