ఎస్‌బీఐ నూతన ప్రాంగణం ప్రారంభం

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ఎస్‌బీఐ కు చెందిన సైబరాబాద్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం (ఏఓ) ప్రారంభం జరిగింది. దీనిని ఎస్‌బీఐ చైర్మెన్‌ దినేశ్‌ ఖరా ప్రారంభించారు. సైబరాబాద్‌ ఏఓ డీజీఎం శ్రీరామ్‌ సింగ్‌, సిబ్బందికి దినేవ్‌ ఖరా ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలని ఈ కార్యక్రమంలో దినేశ్‌ ఖరా చెప్పారు. బ్రాంచ్‌లలో ఉన్న సిబ్బం ది.. బ్యాంకు అంబాసిడర్లు అని ఆయన నొక్కి చెప్పారు. 36 మంది కూర్చోగలిగే స్కూల్‌ బస్సును దినేశ్‌ ఖరా.. సాయి సేవా సంఫ్‌ుకు, రోహిణీ ఫౌండేషన్‌కు మొబైల్‌ డెంటల్‌ కేర్‌ వ్యాన్‌ను డొనేట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్విని కుమార్‌ తివారీ, ఓమ్‌ ప్రకాశ్‌ మిశ్రా, అమిత్‌ ఝింగ్రాన్‌, మంజు శర్మ, దేవాశిశ్‌ మిత్ర, నవీన్‌ కుమార్‌ ఝా, జితేంద్ర కుమార్‌ శర్మ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love