ఏఐఏవైఎస్ మండల ఉపాధ్యక్షుడి నియమాకం

– మాశం బాబుకు నియమాకపత్రమందజేసిన బాలనర్స్
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామానికి చెందిన మాశం బాబు ఏఐఏవైఎస్(ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం)మండల ఉపాధ్యక్షుడిగా నియమాకమైయ్యారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏఐఏవైఎస్ జిల్లాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్ తో కలిసి మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ బాబుకు నూతన మండల ఉపాధ్యక్షుడిగా నియమాకపత్రమందజేశారు. తనపై నమ్మకంతో ఏఐఏవైఎస్ మండల ఉపాధ్యక్షుడి నియమాకానికి సహకరించిన మండలంలోని అయా గ్రామాల అంబేడ్కర్ యువజన సంఘాల సభ్యులు, మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ కు బాబు కృతజ్ఞతలు తెలిపారు. అంబేడ్కర్ యువజన సంఘం బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని బాబు తెలిపారు. రేగులపల్లి గ్రామానికి చెందిన మాతంగి రవిని మండల కార్యదర్శిగా నియమించినట్టు బాలనర్స్ తెలిపారు. ఏఐఏవైఎస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love