హైదరాబాద్ : ప్రముఖ ప్యాకేజింగ్ కంపెనీ ఏజీఐ గ్రీన్ ప్యాక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.53.23 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రిత ఏడాది ఇదే క్యూ3లో రూ.29.44 కోట్ల లాభాలు నమోదు చేసింది. దీనితో పోలిస్తే క్రితం క్యూ3 లాభాల్లో 81 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.396 కోట్ల నుంచి రూ.567 కోట్లకు పెరిగింది. 2022-23 మూడు త్రైమాసికాల్లో రూ.1,061 కోట్ల ఆదాయంతో రూ.153 కోట్ల లాభాలు సాధించినట్లు పేర్కొంది.