ఏడాదిలో 20 వేల స్క్రీన్లు లక్ష్యం

– బెల్‌ ప్లస్‌ మీడియా వెల్లడి
హైదరాబాద్‌ : ఔట్‌డోర్‌ డిజిటల్‌ ప్రకటనల రంగంలో భారీ విస్తరణ లక్ష్యాలు పెట్టుకున్నట్లు బెల్‌ ప్లస్‌ మీడియా వెల్లడించింది. కంపెనీ ఏర్పాటై న రెండేళ్లలోనే దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి 200 నగరాల్లో 20,000 స్క్రీన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా మని బెల్‌ ప్లస్‌ మీడియా సహ వ్యవస్థాపకులు గాయత్రి రెడ్డి, దేవ్‌ అభిలాష్‌ రెడ్డి తెలిపారు. దేశంలో తొలిసారిగా రెండు డిస్‌ప్లేలతో స్క్రీన్లను ఏర్పాటు చేసిన ఘనత తమదేనన్నారు. ఇటీవల నెలరోజుల్లోనే 10 కాంట్రాక్టులు సాధిం చామన్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.7.5 కోట్ల సీడ్‌ ఫండ్‌ను సమీకరిం చామని.. రెండవ రౌండ్‌ ద్వారా త్వరలోనే నిధులు సమీకరిస్తామన్నారు.

Spread the love