ఒక విధ్వంస కావ్యం

కళ్ళ ముందు కదలాడిన భూమి
కొన్ని కలలు కరుగుతూ కడు దుఃఖాన్ని నిలిపింది
సిరియా, టర్కీ ఇప్పుడు
ఓదార్చు లేని దుఃఖపు గూడులా మిగిలింది

ఏ క్షణం ఏ గూడు ఒరుగుతుందో
ఎప్పుడు ఏ గుండె కన్నీటిమయం అవుతుందో
అంతుచిక్కని గడియలు వెక్కిరిస్తున్నా
భారంగా గంటల్ని మోస్తూ ఉత్కంఠనల నడుమ ఊపిరి
అయోమయాన్ని మోస్తోంది

తప్పొప్పుల నడుమ
అక్కడి మనిషికి ఘోర తప్పిదమే జరిగింది
కలల జీవితం పేకమేడలా కూలాయి
తల్లికి, బిడ్డలు దూరమై తండ్రికి, కన్న పేగులు మాయమై
చుట్టూ వెలుగులు ఉన్నా
దుఃఖపు పెను చీకటి ఆవహించింది

మనిషి జీవనయానంలో అత్యాశ అడుగుల్లో
ప్రకృతిని విస్మరించి తప్పుల్ని తన తలపై రుద్దుకొని
తకరారుపై తన తలని నిలిపాడు
ప్రకృతి కోపాగ్నికి తనే బలిపశువై పోయాడు

మనిషికి కనువిప్పు కలగాలి
భూమిపై తనతో పాటు ప్రకృతిని కాపాడు కోవాలి
విపత్కర విధ్వంసాల నుండి
తనను తాను రక్షించుకోవాలి
ఏది ఏమైనా సిరియా భూకంపం
మనిషి చరిత్రలో ఒక విధ్వంస కావ్యంలా
నిలవడం కడు దుఃఖభరితం…!!

– మహబూబ్‌ బాషా చిల్లెం, 9502000415

Spread the love