ఒప్పో ఎ78 5జి స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ

– ధర రూ.18,999
ముంబయి : ఒప్పో తన 5జి విభాగంలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎ78ను విడుదల చేసింది. 8 జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజీతో దీన్ని ఆవిష్కరించింది. జనవరి 18నుంచి అమ్మకానికి పెడుతున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. సింగిల్‌ వేరియంట్‌లో ఆవిష్కరించిన ఈ ఫోన్‌ ధరను రూ.18,999గా నిర్ణయించింది. 5000ఎంఎహెచ్‌ బ్యాటరీ, వెనుకాల 50 ఎంపి, 12.5, 2 ఎంపి కెమెరాలతో సహా సెల్ఫీ కోసం 8ఎంపి కెమెరాను అమర్చింది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై పలు క్రెడిట్‌, డెటిట్‌ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది.

Spread the love