ఓయూ ప్రొఫెసర్ కాసిం దీక్షకు టీయూ పిడిఎస్ యూ మద్దతు

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాసిం చేస్తున్న నిరసన దీక్షకు తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుపు తీసుకున్నామని వారన్నారు. మంగళవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం చేస్తున్న నిరసన దీక్షకు తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతూన్నమన్నారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి 39 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని, ఇవి కేవలం యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులకు జీతాలకే సరిపోతాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్లు నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో నూతన బాలికల వసతిగృహం, ఆడిటోరియం నిర్మించాలని, స్పోర్ట్స్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ,ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శివ సాయి, నాయకులు అశ్విత్, శేషు, మణికంఠ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love