ఓ రెండు ప్రేమ మేఘాలిలా..

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎస్‌కేఎన్‌, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్‌ దర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. తొలి ప్రేమంత స్వచ్ఛంగా సాగిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యాన్ని అందించగా, విజరు బుల్గానిన్‌ స్వరపర్చారు. శ్రీరామ్‌ ఆలపించారు. బ్యూటిఫుల్‌ లవ్‌ సాంగ్‌గా శ్రోతలను ఈ పాట ఆకట్టుకుంటోంది.

Spread the love