కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన తాహసిల్దార్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం తహసిల్దార్ అల్లం రాజకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు వైద్య బృందం డాక్టర్లను మరియు సిబ్బందిని కార్యక్రమం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని అధికారులు డాక్టర్లు సిబ్బంది ఒకరికొకరు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున ఉదయం వేళ గానీ సాయంత్రం వేళ కాని రైతులు వ్యవసాయ కూలీలు కంటి వెలుగు కార్యక్రమంలో హాజరై వారికి కేటాయించిన తేదీల ప్రకారం వచ్చి కళ్ళను చూయించుకొని అద్దాలను తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీసం సమ్మయ్య రెవెన్యూ ఆర్ ఐ రాజేందర్ నామ్ పూర్ణ  చందర్ రఘు తదితరులు పాల్గొన్నారు.

Spread the love