కార్మికులకు డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి

– ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు పి.నాగేశ్వర్‌
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
మార్కెట్లలో పనిచేస్తున్న కార్మికులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలని ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు పి.నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాసంఘాల పోరాట వేదిక సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశమై మాట్లాడుతూ నిత్యం పని చేస్తున్న హమాలీలు, రిక్షా, భవన నిర్మాణ, ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయింపులో వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. మహారాజ్‌ గంజ్‌, కిషన్‌గంజ్‌, ఉస్మాన్‌ గంజ్‌, ఫీల్‌ఖాన, బేగంబజార్‌, జుమేరత్‌ బజార్‌, బజార్‌, చూడి బజార్‌, గౌలిగూడ, తదితర ప్రాంతాల్లో సోషల్‌ ఎకానమీ సర్వే నిర్వహించి ఇండ్లులేని కార్మికులను గుర్తించి అరులైన వారికి ఇండ్లు కేటాయించాలన్నారు. కూలి చేసుకుని బ్రతికే కార్మికులు అద్దె ఇళ్లల్లో ఉంటూ హత్యలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అనంతరం నాంపల్లి ఎంఆర్‌ఓ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు కె. జంగయ్య, సాయిలు, బి. రాములు, ఎన్‌. కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love