కాలం నిర్ణయిస్తుంది

– ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంపై సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కవిత తిప్పికొట్టారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ వేదికగా ”రాజగోపాల్‌ అన్న .. తొందరపడకు, మాట జారకు…28 సార్లు నా పేరు చెప్పించినా, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు” అంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్కం ఠాకూర్‌కు కూడా ఇలాగే గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ”నాపై నిందలు పూర్తిగా బోగస్‌, అవాస్తవం. నా నిబద్ధతను కాలమే రుజువు చేస్తుంది. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎండగడుతుండడంతో బీజేపి భయపడుతున్నది” అంటూ ట్విట్టర్లో కౌంటర్‌ ఇచ్చారు.

Spread the love