కాలేరు కరంచంద్ సన్మానించిన యువత

నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని మల్లక్ పల్లి గ్రామానికి చెందిన ధర్మసాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ, మండల సీనియర్ నాయకులు కాలేరు కరంచంద్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సహాకారంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గా రెండవసారి నియమితులైన శుభసందర్బంగా కరుణాపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గుర్రపు ప్రవీణ్ అధ్వర్యంలో గురువారం ఆయనను యువత మార్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి తాటికాయల చిరంజీవి, చిల్పూర్ మండల యూత్ ఉపాధ్యక్షుడు ఆరూరి రవిచందర్, యూత్ నాయకులు వేమునూరి పాల్సన్ రాజ్, రాజారపు నిర్మల్ , మనోహర్,రాజేష్ , భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love