‘కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్న తెలంగాణ’

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పలు రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుంటున్నదని రమాదేవి లంక తెలిపారు. గూగుల్‌ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన గూగుల్‌ ఫర్‌ ఇండియా సమ్మిట్‌ 2022 లో ఆమె పాల్గొన్నారు. ఇందులో పాల్గొనేందుకు గూగుల్‌ ముగ్గురు మహిళలను ఎంపిక చేయగా వారిలో రమాదేవి ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎమెర్జింగ్‌ టెక్నాలజీ విభాగానికి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ ఇస్తున్న ప్రోత్సాహంతో 35కు పైగా ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మైక్రో ఫైనాన్స్‌, వాతావరణ మార్పు రంగాల్లో కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నట్టు ఆమె తెలిపారు.

Spread the love