కృష్ణా జలాలపై అమీతుమీ

–  కేంద్రంతోపాటు కర్నాటకపై బిగ్‌ఫైట్‌
–  ఎగువ భద్ర, ఎగువ తుంగ నిర్మాణాలతో రాష్ట్రానికి నష్టం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం నిర్మిస్తున్న ఎగువ భద్ర, ఎగువ తుంగ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ నిర్మాణాలను ఆపేందుకు చర్యలు తీసుకుంటు న్నది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా 12.24 టీఎంసీల నీటిని, అప్పర్‌ తుంగ ద్వారా 29.30 టీఎంసీల నిటిని వినియోగించుకు నేందుకు కర్నాటక రాష్ట్రం ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణా నికి పూనుకున్నట్టు అధికారిక సమా చారం. ఈ రెండింటి పరిధిలో 3.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు ప్రాజెక్టు లు పూర్తయితే తెలంగాణకు ఎగువ నుంచి చుక్కనీరు కూడా రాదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎగువ తుంగ పరిధిలోని ఆరు డిస్ట్రీబ్యూటరీల పనులు ఇప్పటికే కర్నాటక పూర్తి చేసింది. ఇతర పనులూ కూడా ఇంకా నడుస్తున్నాయి. అలాగే ఎగువ భద్రకు సంబంధించి అన్ని పనులు వేగంగా నడుస్తున్నట్టు రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులే చెబుతున్నారు. బచావత్‌ ట్రిబ్యు నల్‌ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకు న్నా, కర్నాటక నిర్మాణాల విషయంలో ముందు కు వెళ్లడంపై రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ట్రిబ్యునళ్లు, మార్గదర్శకాలకు విరుద్ధంగా కర్నాటక వ్యవహరిస్తున్నా, ఆ రాష్ట్రా నికి కేంద్రం మద్ధతు ఇవ్వడంపై రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు, విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయపరంగా కర్నాటకను ఎదుర్కోంటూ ఆ రెండు ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే ఆలో చనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర సాగునీటి శాఖ వ్యూహాంగా కనిపిస్తున్నది. ఇందుకు న్యాయనిపుణుల సలహాలు, సూచన లు తీసుకుంటున్నది. అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపక్రమించిన కర్నాటక, ఎలాగైనా వాటిని పూర్తిచేయాలనే తలంపుతో ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అను మతులు లేకుండానే ప్రారంభించిన రెండింటి నిర్మాణాలకు నిలిపి వేయడంతోపాటు అనుమితులు ఇవ్వొద్దంటూ ఇప్పటికే కేంద్ర జలశక్తిశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ రెండు ప్రాజెక్టు లు నిర్మాణమైతే తుంగభద్ర నుంచి కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం తగ్గుతుందనీ, ఆ మేరకు రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తింటాయని సాగునీటి శాఖ ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో కర్నా టకతో పాటు కేంద్ర జలశక్తి శాఖతోనూ కోర్టు ద్వారానే తేల్చుకునే ఆలోచనలో ఉంది. నీటి కేటాయింపు లు లేకుండా ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే, ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణ పై కచ్చితంగా పడుతుందని సాగునీటిరంగ నిపుణుల అంచనా. చిన్న, మధ్యతరహా ప్రాజక్టులు, లిఫ్టుల రూపంలో సుమారు 288 టీఎంసీల అదనపు నీటిని కర్నాటక వాడు కుంటున్నదనీ, 2003లోనే సాక్షాధారాలతో సహా కేంద్ర జలసంఘానికి పలు ఫిర్యాదులు చేశారు. లేఖలూ రాశారు. కర్నాటకతోపాటు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టులకు ఆ రాష్ట్రం సులువుగా అనుమతులు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర సాగునీటి శాఖ అభిప్రాయంగా ఉంది. ఇటీ వల అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రక టిస్తూ తాజా బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లను కేటాయించిన సంగతి తెలి సిందే. అదే తెలంగాణకు చెందిన పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదాను తిరస్కరిం చింది. దీంతో మోడీ సర్కారు రాజకీయంగా వివక్షను ప్రదర్శిస్తున్నదనే విమర్శలు బహిర్గత మైనట్టయింది. ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు నీటి ప్రవాహాం అక్కడ ఉంటుందని సమాచారం. సుమారు 5000 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.ఎగువతుంగపై ఎలాంటి ప్రాజెక్టు లు కట్టినా శ్రీశైలం ఎండిపో తుందని సాగు నీటి రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా ఏపీతో పాటు తెలంగాణలోని కల్వ కుర్తి, పాల మూరు ఎత్తిపోతల పథకా లు తీవ్రంగా నష్టపోతాయని వ్యాఖ్యాని ంచారు.ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం లో 50 టీఎంసీలే ఉంటున్నా యని గుర్తు చేశారు. ఈ విషయం తెలంగాణ సాగు నీటి, ఆయకట్టు శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళధర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.

Spread the love