– అయ్యప్పను అవమానించాడన్న ఇండియా టుడే
– ట్వీట్‌ను ఆలస్యంగా తొలగించిన ఛానెల్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ టీవి ఛానల్ ఫేక్‌న్యూస్‌ను ప్రసారం చేసింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో శబరిమల అయ్యప్పపై వివాదాస్పద ప్రసంగం చేసిన నాస్తిక సమాజం నేతని కేరళకు చెందిన సీపీఐ(ఎం) నేతగా ఇండియా టుడే న్యూస్ ఛానల్ తప్పుగా ప్రసారం చేసింది. అయ్యప్ప జననంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కేరళకు చెందిన సీపీఐ(ఎం) నేతగా చిత్రీకరించారు. ఇండియా టుడే ఛానెల్ ఈ ఫేక్ న్యూస్‌ను ఇంగ్లీష్ న్యూస్ బులెటిన్‌లో ప్రసారం చేసిన వీడియోను ట్వీట్ కూడా చేసింది. కేరళలో బైరి నరేష్ అనే సీపీఐ(ఎం) నాయకుడు లేడనీ, కేరళకు చెందిన సీపీఐ(ఎం) కార్యకర్తలతో పాటు పలువురు ట్విట్టర్‌లో స్పందించారు. అయితే ఛానెల్ వార్తను సరిచేయలేదు. ఇంతలో బీజేపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాలతో ఈ అబద్ధం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఛానెల్ వీడియోను అప్‌లోడ్ చేసి ప్రచారం చేస్తోంది. ట్వీట్ చాలా ఆలస్యంగా తొలగించబడినప్పటికీ, ఈ ఫేక్‌న్యూస్ ప్రసారంపై ఇండియా టుడే ఛానెల్ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. బైరి నరేష్‌కి కేరళతో, సిపిఎంతో ఎటువంటి సంబంధం లేకపోయినా, ఆయనను సీపీఐ(ఎం) కేరళ లీడర్‌గా ఇండియా టుడే ఛానెల్ ప్రసారం చేసింది. ఇది ఎలా జరిగిందనే దానిపై ఛానెల్ ఇంకా వివరణ ఇవ్వలేదు.
కేరళ సీపీఐ(ఎం) నేతపై ఫేక్ న్యూస్
7:30 am