-వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 9 ఏండ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, అయినా దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ఆయన బయల్దేరారని ఎద్దేవా చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల్ని నష్టాలపాలు చేసి, ఆ భారాన్ని చార్జీల పెంపు, ఏసీడీల పేరుతో జనంపై మోపుతున్నారని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో విమర్శించారు. రైతును రారాజు చేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను సీఎం కేసీఆర్ నిలుపుదల చేశారన్నారు. రైతుబంధు ఇచ్చి, ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాల రాయితీ ఎత్తేశారనీ, గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదని చెప్పారు. కౌలు రైతుల్ని గుర్తించేది లేదని చెప్పి, వారి జీవితాలను అంధకారంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.