కైకాలకు కాసాని నివాళి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ మతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కైకాల నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. కాసానితోపాటు తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు టీడీ జనార్ధన్‌, తెలుగు మహీళ అధ్యక్షు రాలు ప్రొఫెసర్‌ టి. జ్యోత్స్న, నాయకులు బాలసుబ్రమణ్యం తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Spread the love