కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం

ముంబయి: తాము రెండు కొత్త వ్యాపారాల ను ప్రారంభిస్తున్నట్టు మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ పీజీఐఎం ఇండియా తెలిపింది. అంతర్జాతీయ, ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లను ప్రారంభిస్తు న్నట్టు ప్రకటించింది. ప్రూడెన్షియల్‌ ఫైనాన్షియల్‌ కు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి నిర్వహణ వ్యాపారమైన పీజీఐఎం కొత్త వ్యాపారాల కోసం భారతీయ అనుబంధ సంస్థకు అదనపు దీర్ఘ కాలిక పెట్టుబడి సమకూర్చడానికి అంగీకరించినట్లు పేర్కొంది. నియం త్రణ ఆమోదాలకు లోబడి 2023 ఏప్రిల్‌ 1న రెండు కొత్త వ్యాపారాలను ప్రారంభించ నున్నామని పీజీఐఎం ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆసియా వైస్‌ ఛైర్మన్‌ డేవిడ్‌ ఛాంగ్‌ తెలిపారు. ”భారతదేశంలోని అధిక నికర విలువ, రిటైల్‌ మార్కెట్లలో సంపద ఉత్పత్తి. దేశంలో ఆఫ్‌షోర్‌ పెట్టుబడుల ద్వారా పెరుగుతున్న అవకాశాలను మేము గమనిస్తున్నాం. గత కొద్ది సంవత్సరాల్లో పీజీఐఎం ఇండియా గణనీయమైన వృద్ధిని సాధించింది. అనుభవ సంపద, నిరూపితమైన మా స్థానిక నాయకత్వం పనితీరు మరియు పెట్టుబడి నైపుణ్యాలు తదుపరి దశ వృద్థిపై మాకు అపారమైన విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి” అని డేవిడ్‌ ఛాంగ్‌ పేర్కొన్నారు. ”మా మ్యూచువల్‌ ఫండ్‌ క్లయింట్ల అత్యద్భుతమైన మద్దతుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఒక సమర్థవంతమైన పెట్టుబడి బృందాన్ని సమకూర్చుకొని, విస్తృతమైన కేంద్రీకరణతో కూడిన పీజీఐఎం ఇండియా 2.0ను ప్రారంభించడానికి అది మమ్మల్ని ప్రోత్సహించింది.” అని పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సిఐఒ శ్రీనివాసరావు రావూరి పేర్కొన్నారు.

Spread the love