కోమటిరెడ్డి ఎవరో నాకు తెలియదు: కెఎ పాల్‌

న్యూఢిల్లీ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి హుజురాబాద్‌ లో మూడు లక్షల ఓట్లు ఉంటే, మూడు వేల ఓట్లు పడ్డాయని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టని, కాంగ్రెస్‌ పార్టీ గెలవదని అందరికీ తెలుసని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణలో ఎక్కడా లేదనీ, టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో తూడ్చుకపోయిందని అన్నారు. అందుకే కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టారనీ, ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు ఆయా కులాలకే పరిమితం అయ్యాయని పేర్కొన్నారు.

Spread the love