క్రితికకు వింగ్‌ విభాగంలో ఆల్‌ ఇండియా బెస్ట్‌ క్యాడెట్‌ బంగారు పతకం

నవతెలంగాణ-కాప్రా
ఈసీఐఎల్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కిరణ్‌ కుమార్తె సార్జెంట్‌ ప్రేమ్‌ క్రితిక గురుగుబెల్లి (17) సీనియర్‌ వింగ్‌ విభాగంలో ఆల్‌ ఇండియా బెస్ట్‌ క్యాడెట్‌ పోటీలో బంగారు పతకం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆమె ఈ పతకం అందుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా వారి తల్లిదండ్రులు ప్రేమ్‌కిరణ్‌, విద్యా మందాకినిలు చాలా సంతోషిచారు. ఈసీఐఎల్‌ ఉద్యోగి కుమార్తె ఇంతటి ఘనత సాధించినందుకు ఈసీఐఎల్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌.భాస్కర్‌రెడ్డి, యూనియన్‌ ఆఫీస్‌ బేరర్స్‌.. వారికి శుభాకాంక్షలు తేలియజేస్తూ సంతోషం వ్వక్తం చేశారు.

Spread the love