గంగారా తండాలో కంటి శిబిరం ప్రారంభం

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలోని గంగారా  తండా లో తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్,ఎంపిఓ రాజ్ కాంత్ రావు లువైద్య సిబ్బంది తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించడం  జరిగిందని, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి కంటి పరీక్ష ఉచిత శిబిరానికి రప్పించారు. పలువురి కి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతే బిందు శస్త్ర చికిత్స  కొరకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి పలువురిని రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అరుంధతి, భాను ప్రియ, అంశం కార్యకర్తలు బండ ప్రమీల, అసిఫా, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love