– వితంతువులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ సహకారం
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కౌశెట్టివాయి, లింగాల, కొత్తూరు, కాటాపుర్, నాంపల్లి గ్రామలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్ధ ఖమ్మం వారి అధ్వర్యంలో 36 మంది వితంతువలకు బియ్యం , చీరలను సర్పంచ్ పుల్లురి గౌరమ్మ చేతుల మీదుగా సోమవారం పంపిణి చేశారు. ఈ సoదర్భంగా కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలలో నిరుపేద వింతంతువులకు గుర్తించి, ఇంత మంచి సాయం చేసిన గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థను అభినందించారు. ఏజెన్సీలో వారి సేవలు మరువలేని అని కొనియాడారు. సమస్త నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌరమ్మ, ఏరియా లీడర్ కంతి ముత్తయ్య, ముర్రం రాజేష్, కంతి యేసు బాబు, పున్నం ఆంజనేయులు, జకర్య సత్యనండం, తిమోతి విష్ణు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.