గ్రంథాల్లోకెల్లా భరత రాజ్యాంగమే గొప్పది

– రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌
– మాజీ చైర్మన్‌ గుండా చంద్రయ్య
నవతెలంగాణ-నర్సింహులపేట
కులాలకతీత సామాజిక చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు,దార్షనికుడు ఆదర్శప్రాయుడు డాక్టర్‌ భీమ్‌ రావు అంబేద్కర్‌ అని రాష్ట్ర మానవ హక్కుల క మిషన్‌ మాజీ చైర్మన్‌ గుండా చంద్రయ్య అన్నారు. ఆదివారం మండలంలోని భోజ్జన్నపేట గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ము ఖ్యాతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ఛైర్మన్‌ బొల్లం రమేష్‌, ప్రధాన అర్చకులు నందనాచార్యులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. శాలువాతో సన్మానించారు.అనంతరం బొజ్జన్నపేట గ్రామంలో ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అధికారి పిఎన్‌ మూర్తి, స్ధానిక యువజన సంఘం నాయకులతో కలిసి అంబేద్కర్‌ విగ్రహావిష్క రణ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అంబేద్కర్‌ లాంటి గొప్ప మహినీయ వ్యక్తి లేడని అ న్నారు. విదేశాల్లో బారిష్టర్‌, ఆర్థిక సంస్కరణలకు సం బంధించిన విద్యను అభ్యసించిన అంబేద్కర్‌ తన కొర కు కాకుండా తన దేశం కొరకు చరిత్రను మార్చడాని కి భారత దేశానికి వచ్చాడని వచ్చి భారత రాజ్యాంగా న్ని రచించి దేశప్రజలకు అందించిన గొప్ప మహనీ య వ్యక్తి అని కొనియాడారు. దేశ సంపద మొత్తం ఒకరిద్దరి చేతుల్లోనే ఉందని అలా కాకుండా ప్రతి ఒ క్కరు విద్యతోపాటు తమ యొక్క ఆర్థిక వృత్తిని ఎం చుకుని వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టుకోవాలని బ్యాంకులలో దాచుకుంటే పెట్టుబడి మొత్తం కొంత మంది వ్యాపారస్తుల చేతిలోనే ఉంటుందని, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలంటే బ్యాంకులు కొరివి పెడుతున్నాయని ఆయన అన్నా రు. పొదుపు పెట్టుబడి తమ పిల్లలకు ఆర్థిక ప్రజా స్వామ్యానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. చిన్న గ్రామంలో ఇంటింటికి తమ వంతు ఆర్థిక సహాయం చేసుకొని అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకోవడం హర్షనీ యమని వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పీరినాకి రజిత, మహబూబాద్‌ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పాటిల్‌ వసంత్‌, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పేరుమాల్ల గుట్టయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు, బిఎస్పి జిల్లా ఇ న్చార్జి దార్ల శివరాజు అంబేద్కర్‌ యువజన సంఘం గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love