గ్రామాల అభివృద్ధికి ఒక పైసా తెచ్చావా

– పసుపు బోర్డు చచ్చే దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం సిగ్గుచేటు
– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ-డిచ్ పల్లి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి జిల్లా నుంచి ఎంపిక గెలిచిన గ్రామాల ఒక పైసా తెచ్చావని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తూ గ్రామాల్లో అభివృద్ధి చేస్తుందని ఇది కనబడటం లేదని ఎన్నికల సమయంలో జిల్లాకు పసుపు బోర్డు తెస్తావని హామీనిచ్చి బాండ్ పేపర్ రాసి ఇచ్చి నేటి వరకు ఆ ఉసు ఎత్తకుండా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం సిగ్గుచేటైన విషయమని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గ్రామంలోని వైకుంట గ్రామం క్రీడా ప్రాంగణం ఆలయాల నిర్మాణాలు, రహదారులు, మహిళా భవనం కు ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ ఒలంపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్పల్లి జడ్పిటిసి భాగ్యరెడ్డి జగన్మోహన్ ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ ఎంపీపీ భగవత్ రమేష్ నాయక్ జడ్పిటిసి సుమన రవి రెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పనిచేసే వారికే అన్ని పరేషానులు వస్తాయని చేయని వారికి ఏమి రావని వారికి ఎంత తిట్టినా కోపం వచ్చిన దులుపుకొని పారిపోతారని ఆయన అన్నారు.
మంచి పరిపాలన చేయమని కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అవకాశం ఇస్తే ఎందరో ప్రధాన మంత్రులు 66 ఏళ్లలో చేయని అప్పు ఒక్క బీజేపీ ప్రభుత్వం లోని నరేంద్ర మోడీ 100 లక్షల కోట్లు అప్పుచేసి పెద్దలకు పెట్టారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అప్పు చేసిన గ్రామాల అభివృద్ధికి దాని ఫలాలు అందజేశారని రాబోవు తరాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను పెట్టారన్నారు బిజెపి నాయకులు చౌకబారు మాటలు మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ తమ పదం గడుపుకుంటున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజ మేత్తరు. యువత వారి మాటల వృత్తిలో పడద్దని అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తనకు వచ్చే ఐదు కోట్ల నిధుల్లో నిజాంబాద్ రూలర్ లోని ఆయా గ్రామాలకు అభివృద్ధి చేయడానికి 50 లక్షల రూపాయలు అందజేశారని జిల్లాకు చెందిన ఎంపి ఇప్పటికీ రూపాయి ఇచ్చిన దాఖలు లేవన్నారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎన్నో ఏండ్ల బ్రిడ్జి నిర్మాణ కలను సాకారం చేశారని రోగం మల్లాపూర్ బ్రిడ్జి వాగు నిర్మాణానికి నాలుగున్నర కోట్లు వెచ్చించడం జరిగిందని ఇదే కాకుండా మల్లాపూర్ స్వాగత నుండి లోనం వరకు సిసి రహదారి నిర్మాణానికి 55 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు ఇదే కాకుండా పలువురి కోరిక మేరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ లో నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తారని హామీలు ఇచ్చారు అంతకుముందు సర్పంచ్ రోగం సత్యనారాయణ ఉపసర్పంచ్ రఘునాథ రాముల ఆధ్వర్యంలో గ్రామ స్వాగత తోరణం నుండి డప్పు వైద్యాలు బోనాలతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ బీసీ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూషణ్ అంజయ్య ఎంపీటీసీ డీకొండ సరిత సుధీర్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలివేరి దాస్ సర్పంచ్లు నరేష్, తేలు గణేష్, తేలు విజయ్ కుమార్, ఎంపిటిసిలు బాబురావు, సినియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, తటి పాముల శ్రీనివాస్ గుప్త, ఎంపీడీవో రాములు నాయక్, పి ఆర్ ఏ ఈ కిషన్ నాయక్ వెంకటేశ్వర్లు ఎస్సై నరేష్ కుమార్, పాటు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love