గ్రూప్‌-3 దరఖాస్తుకు నేడే ఆఖరు

– ఇప్పటి వరకు 4.85 లక్షల దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌ -3 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. 1,375 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4.85 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం. గ్రూప్‌-3 రాతపరీక్షలను జులై లేదా ఆగస్టులో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది.

Spread the love