ఘనంగా కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ మినీ జాతర

– భక్తుల రద్దీతో కొనసాగుతున్న మేడారం
– క్యూలైన్ల ద్వారా దర్శనాలు
– దొంగతనాలు పూర్తిగా నియంత్రించిన పోలీసులు
– నిరంతర వైద్య సేవలు
– తప్పిపోయిన వ్యక్తుల శిబిరం
– ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం
నవతెలంగాణ -తాడ్వాయి
హాస్యాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మినీ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతుంది. మినీ మేడారం జాతరకు రెండవ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పుణ్య స్థానాలతో జంపన్న వాగు కలకలాడుతుంది. జంపన్న వాగులో పుణ్య స్థానాల ఆచరించి కుట్టు వెంట్రుకలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
క్యూలైన్ల ద్వారా దర్శనం
ఈసారి మేడారం మినీ జాతరకు ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు వినూత్న రీతిలో క్యూ లైన్ లలో గద్దెల వద్ద ఒత్తిడి, తొక్కిసలాట లేకుండా దర్శనాలు చేస్తున్నారు. క్యూలైన్లను ఎక్స్టెన్షన్ చేసి రెండు క్యూ లైన్ ల ద్వారా గద్దెల వద్దకు చేరుస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పోలీసులు కీలక పాత్ర పోషించి తొక్కిసులాట జరగకుండా కృషి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, వన దేవతల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు గద్దెల వద్దకు చేరుకొని దర్శనం చేసుకునేలా కృషి చేస్తున్నారు. గతంలో అయితే గద్దెల లాక్ వేసి బయటనుండే దర్శనాలు చేయించేవారు. ఈ జాతరకు అలాకాకుండా ప్రతి భక్తుడు గద్య పైకి వెళ్లి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. పోలీసులు దగ్గరుండి దర్శనాలు చేస్తున్నారు.
దొంగతనాలు పూర్తిగా నియంత్రణ
గతంలోని మేడారం, మినీ మేడారం జాతరలో దొంగతనాలు జరగడం పరిపాటిగా ఉండేది. ఈసారి మినీ జాతరకు ఎస్పీ గౌస్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్ ల ఆద్వర్యంలో సీఐ వంగ శంకర్, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు ల ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగానే గద్దెల ప్రాంగణంలోని ఎండోమెంట్ ఆవరణలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి గద్దెల ప్రాంగణంలో సివిల్ దుస్తుల తో మఫ్టీలో పోలీసులు గద్దె ప్రాంగణంలో, ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మఫ్టీలో పోలీసులు ఉంటున్నారు. దొంగతనాలు చదవకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. గత నెల రోజుల ముందుగానే గతంలో దొంగతనాలు చేసిన వారి ఫోటోలను వాట్సప్ గ్రూపుల ద్వారా పోలీసులలో షేర్ చేసుకుని ఎక్కడ కనబడితే అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నెల ముందు ప్రీ జాతరలో వచ్చిన ఆదిలాబాద్ ఏరియా కు సంబంధించిన దొంగలను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇలా ముందస్తుగానే అన్ని కట్టు దిట్టైనా భద్రతా చర్యలు చేపట్టి ఈసారి మినీ మేడారం జాతరకు ఒక్క దొంగతనం కూడా జరగకుండా కృషి చేశారు.
మినీ మేడారం జాతరలో తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలు
మినీ మేడారం జాతరలో జంపన్న వాగు, వాగు బయట, ఎండోమెంట్ మంచిపై, గద్దెల వెనుక భాగాన నాలుగు తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రతిరోజు జి సి డి ఓ (గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) పెనక సుగుణ అక్కడనే ఉండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ ఈ కేంద్రాల ద్వారా తెలియపరుస్తున్నారు. తప్పిపోకుండా భక్తులకు తగిన సూచనలు, సలహాలిస్తున్నారు. తప్పిపోయిన భక్తులకు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబాలకు పంపిస్తున్నారు.
కన్నెపల్లిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సమ్మక్క వనదేవత కూతురు అయిన సారలమ్మ వనదేవత పుట్టిన ఊరు కన్నెపెల్లి లో భక్తుల కొనసాగుతుంది. సార్లమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో రెండవ రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కన్నెపెల్లి లో భక్తులకు పూజారులు సౌకర్యాలు కల్పించారు.

Spread the love