చర్చి నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు..

– చేర్చినిర్మాణ స్థలంవద్ద  విద్యుత్ సరఫరా పనులు నిలిపి , అధికారులకు పిర్యాదు అందజేత
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామం వైపు వెళ్లే రోడ్ పక్కన ఏర్పాటు చేసిన గృహ నిర్మాణాల వెంచర్లో  చేర్చి నిర్మాణం చేసేందుకు పథకం పన్నిన ఆంద్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మెస్ట్రీలపై ఘనపూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శి కి గురువారం సర్పంచ్ గడ్డం రాధాకృష్ణ రెడ్డి, ఉప సర్పంచ్ అసాది రవిమధర్ లతో కలిసి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వెంచర్లోని  చుట్టూ పక్కల గృహా నిర్మాణ ప్లట్స్ వారు కల్సి చర్చి నిర్మాణానన్నీ వెతిరేకిస్తూ, నిర్మాణానికి అనుమతులు ఇవద్దని పిర్యాదు పత్రం అందచేశారు. చర్చి నిర్మాణానికి పథకం పన్నిన వారిపై తమ గ్రామస్థులందరు వెతిరేకిస్తు న్నామన్నారు. నిర్మాణ పనులు అపాకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని  హెచ్చరించారు. అనంతరం విద్యుత్ పనులు నిలిపివేసి, విద్యుత్ శాఖ అధికారి చర్చి నిర్మాణ పనులకు  అతి ఉత్సాహం చూపుతూన్నరని, విద్యుత్ ఎక్కడికి అంటే అక్కడికి సరఫరా చేయడమే తమ బాధ్యతనఅని ఫోన్ ద్వారా , డిచపల్లి గ్రామస్థులతో  రూల్స్ తో వాక్ వాదానికి దిగడంతో  గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారి  పై చేర్చి నిర్మాణనికి ప్రత్యేకంగా ఇంత చొరవ చూపడంలో ఆంతర్యం ఏమిటని గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Spread the love