నవతెలంగాణ-హసన్‌పర్తి
కాకతీయ విశ్వవిద్యాలయం జియాలజికల్ విభా గాధిపతి ఆచార్య ఆర్.మల్లికార్జునరెడ్డి ఆదివారం 10 దేశాలకు చెందిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే శాస్త్రవేత్తలతో కలిసి రామప్ప, వేయి స్థంబాల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయాల నిర్మాణం, లైఫ్, వందల సంవత్సరాల వరకు ప్రకృతి విపత్తులు సంబవించిన నిలబడడానికి ఆనాటి శాస్త్ర వేత్తలు వాడిన టెక్నాలజీ, నిర్మాణ సామాగ్రిని వివ రించారు. ఈ కట్టడాలను పోలిన మరిన్ని కట్టడాలను వివరించారు. భూకంప తీవ్రతలను తట్టుకునే పలు అంశాల గురించి తెలిపారు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కట్టడాల జీయో టెక్నాలజీ అం శాలు, సాండ్ బాక్స్ టెక్నాలజీ తదితర ఇంతాక్ కన్వినర్ ఆచార్య పాండురంగరావుతో కలిసి వివరిం చారు. ఇరాన్, ఇథియోపియా, సూడాన్, దక్షిణ సుడాన్, ఉగాండా, కమారోన్, ఖజకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నీటిలో తేలియాడే తేలియాడే ఇటుకలు శిల్పకళ, నిర్మాణాలు తెలుసుకొని ఆశర్యం వ్యక్తం చేసారు. ఈ ప్రాంత ఖనిజాల ఇనుము, డోలమైట్, గ్రానైట్ గురుంచి తెలు సుకున్నారు. అనంతరం బృందానికి ఆచార్య పాండు రంగారావు రచించిన పుస్తకాలను బహుకరించారు. జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా జియాలజిస్టులు అమ్రుత్తే, మల్లేశం పర్యటనను పర్యవేక్షించారు.