– బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రం డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
దేశంలోని అడవి జంతువుల గణను చేపట్టిన అధికార ప్రభుత్వాలు..మానవుల గణను చేపట్టంలో నిర్లక్యంగా వ్యవహరిస్తున్నాయని చిత్తశుద్దుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీ కులగణను వేంటనే చేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామంచంద్రం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయితీ కార్యలయ అవరణం వద్ద బీఎస్పీ పార్టీ అద్వర్యంలో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ కోటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. బీఎస్పీ నాయకులు లింగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.