జడేజాకు అగ్రస్థానం

–  ఐసిసి టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితా విడుదల
దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసిసి) తాజా ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానానికి ఎగబాకాడు. అలాగే టాప్‌-5లో ఏకంగా ముగ్గురు ఆల్‌రౌండర్లు దక్కించుకున్నారు. ఐసిసి తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా(406 పాయింట్లు) టాప్‌లో నిలువగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌(376 పాయింట్లు)2వ స్థానంలో నిలిచాడు. ఇదే క్రమంలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్న అక్షర్‌ పటేల్‌(283 పాయింట్లు) ఐదో స్థానానికి ఎగబాకాడు. ఐసిసి ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఐసిసి టెస్టు బౌలర్ల జాబితాలో అశ్విన్‌ (864 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ (866 పాయింట్లు)కు అగ్రస్థానానికి ఎగబాకాడు.

Spread the love