జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

– పి.డి.ఎస్.యు డిమాండ్
– సంక్షోభంలో విద్యారంగం..
అరకొర నిధుల కేటాయింపుతో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ విద్యా రంగం
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశ బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, సెమినార్ హాల్లో పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ మాట్లాడుతూ, గడిచిన ఎనిమిది ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అనుకూల నిధులు కేటాయించకపోవవడం వల్ల విద్య పతనమైందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం చేస్తూ విద్యారంగం సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరికినే ప్రసక్తి లేదని తెలిపారు. ఉపాధ్యాయుల నిమ్మకాలు లేక విద్యాసంస్థల నూత భవన నిర్మాణాలు లేక ఏళ్ల తరబడి స్కాలర్షిప్ రాక, మెస్, కాస్మోటిక్ చార్జీలు బకాయిలు చెల్లించక విద్యార్థులను ప్రభుత్వం మానసికంగా ఇబ్బంది పెడతానన్నారని తెలిపారు.
కెసిఆర్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు గాలికి వదిలి తెలంగాణ సంపాదన బడా కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, ఎమ్మెల్యేల జీతాలకు దోచిపెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యారంగా అభివృద్ధికి చేయూతనిచ్చి ప్రభుత్వ విద్యాలయాన్ని తీర్చిదిద్దాలని ప్రైవేటీకరణను తీసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొఠారి కమిషన్ ఆదేశాలను ఆచరిస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కి 500 కోట్ల నిధులు కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అదేవిధంగా నిజామబాద్ జిల్లాకు ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రభంజన్ యాదవ్, రమణ చారి, స్వామి రావు, పి.డి ఎస్.యు నిజామబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, ఉపాధ్యక్షులు అశుర్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్, ఏ.ఐ.యస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం విద్యార్థి నాయకులు మహిపాల్ ప్రసాద్,శ్రీశైలం, రఘుపతి,చైతు లు పాల్గొని అభివాదం చేశారు.

Spread the love